హైదరాబాద్ : భారతదేశపు అతి పెద్ద, అత్యంత విశ్వసనీయమైన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్, భారతదేశంలో సరికొత్త చరిత్ర సృష్టించనున్న వంపు తిరిగి ఉండే ఒడిస్సీ జి9 మరియు జి7 గేమింగ్ మానిటర్ల తన కొత్త శ్రేణిని విడుదల చేసింది. CES 2020 వద్ద ఆవిష్కరించబడిన ఈ మానిటర్లు, సౌకర్యవంతమైన కర్వేచర్ను, మనోహరమైన సంభాషణలను మరియు చూడచక్కని పిక్చర్ క్వాలిటీని రంగరించటం ద్వారా గేమింగ్ అనుభవాన్ని పునఃఆవిష్కరిస్తాయి.
ఈ కొత్త శ్రేణి గేమింగ్ మానిటర్లలో రెండు మోడళ్ళు ఉన్నాయి; G9 – పరిశ్రమలో అగ్ర స్థానంలో ఉన్న 49-అంగుళాల డిస్ప్లే – ఇంకా G7, 32 అంగుళాలు మరియు 27- అంగుళాల రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు ఒడిస్సీ గేమింగ్ మానిటర్లు, అచ్చెరువొందించే గేమింగ్ను తదుపరి స్థాయికి తీసుకువెళ్ళేందుకు అనువుగా రూపొందించబడ్డాయి. నేటి నుండి ప్రీ-బుకింగ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి.
ఒడిస్సీ మానిటర్లు, ప్రపంచంలో మొట్టమొదటి 1000R గేమింగ్ మానిటర్లు. అంటే ఇందులో 1,000 మిల్లీ మీటర్ల కర్వేచర్ రేడియస్ ఉంటుంది. అత్యంత మనోహరంగా ఉండేందుకు, కంటికి అతి తక్కువ ఒత్తిడి కలిగించేందుకుగాను మనిషి కంటి యొక్క వంపుకు ఇది అనుగుణంగా ఉంటుంది. TÜV రీన్ల్యాండ్ అనే అగ్రశ్రేణి అంతర్జాతీయ సర్టిఫికేషన్ సంస్థ, ఒడిస్సీ మానిటర్ల అత్యుత్తమమైన పనితీరును ధృవీకరించింది. ఈ సంస్థ, సామ్సంగ్కు పరిశ్రమలో మొట్టమొదటి ఉత్తమ పనితీరు కలిగిన 1000R వంపు తిరిగిన డిస్ప్లే మరియు ఐ కంఫర్ట్ (కంటికి సౌకర్యం) సర్టిఫికేట్ ప్రదానం చేసింది.
మెరుపు వేగం, అతి తక్కువ ఏకాగ్రతభంగం, అతి ఎక్కువ ప్రతిస్పందనాత్మకతల కోసం గేమర్ల అవసరాలను తీర్చేందుకు ఒడిస్సీ మానిటర్లు 1 ఎంఎస్ ప్రతిస్పందనా టైమ్ మరియు 240 హెర్జ్ల రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. ఇందువలన, సాంప్రదాయ స్క్రీన్తో పోల్చి చూస్తే ప్రతి సెకండుకు స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే ఫ్రేముల సంఖ్య నాలుగు రెట్లవరకు ఉంటుంది. ఒడిస్సీ మానిటర్లు, ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి డ్యూయల్ క్వాడ్ హై-డెఫ్నిషన్(DQHD) మానిటర్లు. ఈ మానిటర్లు సుస్పష్టమైన QLED పిక్చర్ నాణ్యత ఉండి, అనుపమానమైన సవివరమైన, పిన్-షార్ప్ ఇమేజ్లతో మనోహరమైన గేమింగ్ అనుభవాన్ని కలిగిస్తాయి.
సామ్సంగ్ వారి సరికొత్త గేమింగ్ మానిటర్లు NVIDIA G-SYNC® కంపాటిబిలిటీ మరియు DP1.4 పై అడాప్టివ్ సింక్ను సపోర్ట్ చేసి, గ్రాఫిక్స్ కార్డ్ నుండి ప్రతి ఫ్రేమ్ను ఒడిస్సీ మానిటర్ మ్యాచ్ అయ్యేట్లు చేయటం ద్వారా గేమర్లకు ఏ ఫ్రేమ్ ఎప్పుడూ డ్రాప్ కాకుండా ఉండునట్లు చేస్తాయి.
ఇక డిజైన్ విషయానికి వస్తే, గేమింగ్ మానిటర్లు ఏ విధంగా కనిపించగలవనే విషయంలో ఈ రెండు మానిటర్లను పూర్తిగా ఒక కొత్త ఆలోచనతో మరలా డిజైన్ చేయటం జరిగింది.
“ఈ కొత్త ఒడిస్సీ పోర్ట్ఫోలియో వలన, గేమర్లు తమ పెర్ఫార్మెన్సులను గణనీయంగా మెరుగుపరుచుకునే అవకాశాన్ని కలిగించే, పరిశ్రమలో అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానం మరియు డిజైన్తో ఆవిష్కరణను ప్రోత్సహించటాన్ని సామ్సంగ్ కొనసాగిస్తున్నదని ఋజువవుతుంది. గేమింగ్ అభిమానులు ఇప్పుడు, తదుపరి స్థాయి, ఉత్కంఠను కలిగించే, మనోహరమైన గేమింగ్ అనుభవాన్ని పొందగలుగుతారు. ఇందుకై వారికి, పరిశ్రమలో మునుపెన్నడూ లభించని 1000ఆర్ కర్వేచర్, 1 ఎంఎస్ రెస్పాన్స్ టైమ్, 240 హెర్జ్ల రిఫ్రెష్ రేట్, హెచ్ఆర్డి 10 ప్లస్, ఇంకా మరెన్నో ఫీచర్లు సహకరిస్తాయి. కర్వేచర్, సౌకర్యం మరియు పోటీలో ముందడుగులో ఉండే సద్గుణాల సమ్మేళనం, సామ్సంగ్ వారి ఒడిస్సీ వంపు తిరిగిన మానిటర్లు. ఈ మానిటర్ల విడుదలతో గేమింగ్ మానిటర్ మార్కెట్లో మా ఉనికి మరింత పటిష్టం కాగలదు,” ఆని పునీత్ సేఠీ, వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎంటర్ప్రైజ్ బిజినెస్, సామ్సంగ్ ఇండియా చెప్పారు.
సామ్సంగ్ ఒడిస్సీ గేమింగ్ మానిటర్లు
గేమింగ్ మునుపెన్నడూ లేనంత పోటీతో కూడుకున్నదిగా మారిన నేపథ్యంలో, అచ్చెరువొందించటం మరియు వేగం కీలకమైనవి. ఈ కొత్త మానిటర్ల గేమింగ్-కేంద్రిత, సాంకేతిక ఆవిష్కరణలు, గేమర్లకు కావలసిన స్పీడ్, రెస్పాన్సివ్నెస్ మరియు అకౌంట్లలోకి అతి తక్కువ డిస్ట్రాక్షన్లు, వాటికి అత్యుత్తమమైన గేమింగ్ అనుభవాన్ని సుసాధ్యం చేస్తాయి..
ఒడిస్సీ G9: అత్యంత మనోహరమైన గేమింగ్ అనుభవం
ఒక ర్యాపిడ్, 240 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1 ఎంఎస్ రెస్పాన్స్ టైమ్, 32:9 యాస్పెక్ట్ నిష్పత్తి, ఒక లోతైన మరియు ఆకట్టుకునే 1000ఆర్ కర్వేచర్, 1000 సిడి/ఎం2 గరిష్టమైన బ్రైట్నెస్లను 49-అంగుళాలు G9, ప్రపంచపు మొట్టమొదటి డ్యూయల్ క్వాడ్ హై-డెఫ్నిషన్ (DQHD; 5120×1440 రిజొల్యూషన్) గేమింగ్ మానిటర్ ఫీచర్ చేస్తుంది. ఈ మానిటర్, క్వాంటమ్ డాట్ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు HDR1000 VA ప్యానెల్ కలిగి ఉండి సజీవమైన రంగులు సుస్పష్టంగా చూపుతుంది. సత్వర రెస్పాన్స్ టైమ్ మరియు రిఫ్రెష్ రేట్, వాటితో పాటు పరిశ్రమలో అగ్రశ్రేణి 1000ఆర్ కర్వ్ సమ్మేళనం, డిస్ట్రాక్షన్లను మరియు లాగ్ టైమ్ను తొలగించి గెలుపుకు మరియు ఒటమికి మధ్య వారధిలా నిలిచే రెప్పపాటు కీలకమైన గేమింగ్ క్షణాల కోసం అల్ట్రా-స్మూత్ స్క్రీన్ మార్పులను ఈ సమ్మేళనం సృష్టిస్తుంది.
తెల్లని గ్లోసీ ఎక్స్టీరియర్, వెనుక కోర్ను కాంతివంతం చేసే ఫ్యూచరిస్టిక్ ఇన్ఫినిటీ కోర్లతో కూడిన నదరుగా కనిపించే కొత్త డిజైన్ G9లో కనిపిస్తుంది. ఇందులో 52 రంగులు మరియు ఐదు లైటింగ్ ఎఫెక్ట్ ఆప్షన్లు ఉంటాయి. ఈ డిజైన్ మరియు లైటింగ్ ఎఫెక్ట్లు, పోటీగా వస్తున్న మిగిలిన వాటితో పోల్చి చూసినా విలక్షణంగా నిలిచి, ఏ గేమింగ్ సెటప్నైనా పరిపూర్ణం చేస్తాయి.
ఒడిస్సీ G7: ఒక సరికొత్త గేమింగ్ అనుభవం
G7లో కూడా జి9లో ఉండే అదే రెస్పాన్స్ టైమ్, రిఫ్రెష్ రేట్, లోతైన వంపు కలిగిన డిస్ప్లే, ఇంకా జి9 యొక్క మొత్తం పనితీరు అంతా, జి9 కన్నా చిన్నదైన 32-అంగుళాలు మరియు 27-అంగుళాల మోడళ్ళలో లభించటాన్ని గేమర్లు అభినందించకుండా ఉండలేరు. G7 యొక్క క్వాడ్-హై డెఫ్నిషన్ (QHD; 2560×1440 రిజొల్యూషన్), 16:9 యాస్పెక్ట్ నిష్పత్తి మరియు HDR600 VA ప్యానెళ్ళను 600 cd/m2 గరిష్ట బ్రైట్నెస్ పరిపూర్ణం చేస్తుంది. అదనంగా, క్వాంటమ్ డాట్ టెక్నాలజీ కలిగిన G7 యొక్క QLED స్క్రీన్, కాంతివంతమైన వెలుతురులో కూడా చాలా స్పష్టంగా కనిపించే అసామాన్యమైన విస్తృతశ్రేణి రంగుల ఉత్పత్తిని కలిగిస్తుంది.
G7ను స్లీక్గా, వెలుపల వైపు మాట్ బ్లాక్ మరియు గేమ్ ఆడేటప్పుడు స్థిరంగానో లేక డిమ్గానో నిలిచి ఉండగలగటమే కాక, గేమర్లు ప్రిఫర్ చేసే విధంగా రంగులను మార్చుకునే, రంగు-మారే వెనుక భాగపు కోర్ లైటింగ్ ఉండేలా పూర్తిగా రీడిజైన్ చేయటం జరిగింది. అంతే కాక, మానిటర్ల యొక్క ముందు వైపు బెజెల్కు డైనమిక్ ఆకారాలను మరియు లైటింగును చేర్చింది G7.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Nov,2020 05:59PM