హర్యానా : అంబాలా- పాటియాలా ప్రాంతం గ్రామీణ బంద్ నిర్వహిస్తున్న రైతులపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, కేరళ, పంజాబ్ రైతులు కాలి నడకన ఢిల్లీకి బయల్దేరారు. అంబాలా - పాటియాలా ప్రాంతంలో హర్యానా పోలీసులు రైతులను అడ్డుకున్నారు. వందల కొద్ది వస్తున్న రైతులను అడ్డుకోడానికి హర్యానా పోలీసులు బారికేడ్లతో రోడ్లను మూసేశారు. రైతులు వెనక్కి వెళ్లిపోవాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. వాటిని పట్టించుకొని రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బారికేడ్లను దగ్గర్లో ఉన్న శంభూ నదిలోకి విసిరి పారేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా రణరంగంలా మారిపోయింది. పోలీసులు రైతులపై టియర్ గ్యాస్, షెల్స్, వాటర్ కెనన్లను ప్రయోగించారు. మరోవైపు రైతులు 'చలో ఢిల్లీ' ప్రకటించిన నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు రోజులుగా తమ సరిహద్దుల్లో పోలీసులను మోహరించింది. బారికేడ్లను సిద్ధం చేసింది. వచ్చిన రైతులను వెనక్కి పంపించడానికి పోలీసులు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. వీటితో పాటు హర్యానా నుంచి పంజాబ్ కు వెళ్లే బస్సు సర్వీసులను కూడా ఖట్టర్ ప్రభుత్వం రద్దు చేసింది,.
Mon Jan 19, 2015 06:51 pm