హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యవసాయాధికారిణి ఆత్మహత్య కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని రాయిపల్లి వంతెన వద్ద సంగారెడ్డి జిల్లా రైతు శిక్షణా ఏరువాక కేంద్రం ఏ ఓ అరుణ(34) నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. భర్తతో చిన్నపాటి మనస్పర్ధలు రావడంతో కుటుంబ పెద్దలు ఇరువురికి నచ్చ చెప్పారు. అయితే గురువారం సంగారెడ్డి నుండి సెలెరియో కారులో వచ్చిన అరుణ తన సెల్ ఫోన్, పర్సు, ఇతర వస్తువులను కారులోనే వేసి రాయి పల్లి వంతెన పైనుండి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కుటుంబీకులు మృతదేహం కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అరుణకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm