హైదరాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెంచికల్పేట్ మండలం ఆగర్‌గూడ సమీపంలోని పెద్దవాగు రేగిచెట్టు మడుగు వద్ద పెద్దపులి నీళ్లు తాగుతుండగా గురువారం గ్రామస్తులు గుర్తించి సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. పులి నీళ్లుతాగి అగర్‌గూడ వైపు అడవిలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm