హైదరాబాద్ : ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ తొలి సీఈవో, పద్మభూషణ్ ఎఫ్.సి.కోహ్లీ (96) కన్నుమూశారు. భారత ఐటీ పరిశ్రమ పితామహుడిగా ఆయన పేరొందారు. 1969లో టాటా గ్రూప్‌లో చేరిన ఎఫ్.సి.కోహ్లీ.. 1996 వరకు టీసీఎస్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995-96 మధ్య కాలంలో నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్) సంస్థకు అధ్యక్షుడిగానూ ఉన్నారు. ఎఫ్.సి. కోహ్లీ మరణం పట్ల టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే, నాస్కామ్ కూడా ఆయన మృతి పట్ల విచారం వ్యక్తంచేసింది.
Mon Jan 19, 2015 06:51 pm