హైదరాబాద్: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) వ్యవస్థాపకుడు, ఎఫ్ సీ కోహ్లీ నేడు కన్నుమూశారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత కోహ్లీ మృతిపై కార్పొరేట్ సంస్థల అధిపతులు, సీఈవోలు, ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. 'భారత ఐటీ రంగానికి ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని, కోహ్లీ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని' కేటీఆర్ చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm