హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలి ఛైర్మన్ గా కేసీఆర్ అవకాశం ఇచ్చారని... నీకు ఇంకేం కావాలని కొందరు ప్రశ్నిస్తున్నారని... రోడ్డు మీద ఖాళీగా ఉంటే తనను తీసుకొచ్చి మండలి ఛైర్మన్ చేయలేదని... తెలంగాణ ఉద్యమంలో తాను కీలక పాత్ర పోషించానని చెప్పారు. కొత్త బట్టలు కొనిచ్చాను... ముడ్డిమీద తంతా పడుండు అంటే ఎలా పడుంటానని ప్రశ్నించారు. ఆత్మాభిమానం లేని చోట తాను ఉండలేనని స్వామిగౌడ్ చెప్పారు. కేసీఆర్ ను తాను తండ్రిలా భావించానని... అయితే, చెప్పుడు మాటలు విని తనను పక్కన పెట్టారని అన్నారు. రెండు నిమిషాల టైమ్ కూడా తనకు ఇవ్వలేదని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm