హైదరాబాద్ : బీడీఎల్ పరిశ్రమలో తయారు చేసిన ఓ నమూనా క్షిపణి మిస్ ఫైర్ అయ్యింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరులోని.. ఓ నమూనా క్షిపణి వేగానికి సంబంధించి పరీక్షలు చేస్తుండగా పరిశ్రమ గోడపై నుంచి దూసుకెళ్లింది. దాదాపు 3 కిలోమీటర్ల దూరంలోని ఓ వ్యవయసాయ పొలంలో పడి కొంతమేర భూమిలోకి చొచ్చుకెళ్లింది. ఓ గ్రామస్థుడు ఇచ్చిన సమాచారం మేరకు సీఐఎస్ఎఫ్ అధికారులు క్షిపణిని స్వాధీనం చేసుకున్నారు. మిస్‌ఫైర్ అయిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో చుట్టు పక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వేగ సామర్థ్యానికి సంబంధించి రీడింగ్ లెక్కిస్తుండగా రెండు తీగలు ఒకదానికొకటి తాకి మిస్‌ఫైర్ అయినట్లు సమాచారం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm