హైదరాబాద్ : 2021 సంవత్సరానికిగానూ సుప్రీంకోర్టు క్యాలెండర్ను విడుదల చేశారు సుప్రీం జనరల్ సెక్రటరీ. ఇందులో చరిత్రలోనే తొలిసారిగా సంక్రాంతి పండుగకు సెలవు దక్కడం విశేషం. జనవరి 14న సెలవు, 15న స్థానిక సెలవుగా పేర్కొంది. సర్వోన్నత న్యాయస్థానానికి శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా.. డిసెంబర్ చివరి రెండు వారాల నుంచి నూతన సంవత్సరం వరకు అత్యున్నత న్యాయస్థానానికి సెలవులు ఉంటాయి. దేశవ్యాప్తంగా జరుపుకునే దసరా, దీపావళి, మహాశివరాత్రి, శ్రీరామనవమి, హోలీ, రంజాన్, బక్రీద్, మొహర్రం, గుడ్ ఫ్రైడే, గురు నానక్ జయంతి సహా స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలు, గాంధీ జయంతికి ఏటా సెలవులు ఇస్తారు. 2021 సంవత్సరానికి క్యాలెండర్ను సుప్రీంకోర్టు జనరల్ సెక్రటరీ గురువారం విడుదల చేయగా.. అందులో తొలిసారి దక్షిణాది రాష్ట్రాలు జరుపుకునే సంక్రాంతి, అసోం పర్వదినం బిహులకు సంబంధించి జనవరి 14, స్థానిక సెలవు రోజుగా 15వ తేదీని పేర్కొంటూ రెండు రోజులు సెలవు ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm