హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం భిన్నంగా ఉంది. ఓ రోజు కేసులు పెరుగుతుండగా మరుసటి రోజు తగ్గుతున్నది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 761 పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,665కు చేరుకోగా.. రికవరీ కేసులు 2,55,378కు పెరిగాయి. ఇప్పటి వరకు కరోనాబారిన పడి 1448 మంది మృతిచెందారు.
Mon Jan 19, 2015 06:51 pm