హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 43,082 పాజిటివ్ కేసులు నమోదు కాగా నిన్న ఒక్కరోజే 492 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 93,09,788కి చేరాయి. మరణాల సంఖ్య 1,35,715కి చేరింది. యాక్టివ్ కేసులు 4,55,555 ఉన్నాయని కేంద్రం తెలిపింది. 24 గంటల్లో 39,379 కొత్త డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 87,18,517 మంది కోలుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm