హైదరాబాద్ : అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం, బుధవారం రాత్రి అనారోగ్యం కారణంగా కన్నుమూసిన డిగో మారడోనా అంత్యక్రియలు ప్రజలు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆయన పార్ధివ దేహాన్ని రాజధాని బ్యూనస్ ఎయిర్స్ శివార్లలోని బెల్లా విస్తా శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబీకులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నప్పటికీ, అంతకు ముందు జరిగిన అంతిమ యాత్రలో లక్షలాది మంది పాల్గొని తమ అభిమాన ఆటగాడికి శ్రద్ధాంజలి ఘటించారు.
Mon Jan 19, 2015 06:51 pm