హైదరాబాద్ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మహాబూబ్ నగర్ లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని గొల్లచర్ల క్రాస్ రోడ్ లో రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని వామపక్షాలు, రైతుసంఘాలు, గిరిజన సంఘాలు, కేవీపీస్, ప్రజాసంఘాలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామీణ బందుకు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు అంగోతు వెంకన్న, రైతు సంఘం జిల్లా ఉప అధ్యక్షుడు బొబ్బ వెంకట్ రెడ్డి, మండల నాయకులు వెంకట్రాములు, గాదె లక్మయ్య, మేకపోతుల అంజన్న తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm