హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ చేరుకుంటామని రైతులు పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కీలక సూచన చేసారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో, రైతు సంఘాలతో చర్చలు జరపాలని మోడీకి కెప్టెన్ అమరీందర్ సింగ్ సూచించారు. పరిస్థితి రోజు రోజుకూ తీవ్రమవుతోందని, దీన్ని ఇలాగే వదిలి పెట్టకూడదని ఆయన హితవు పలికారు. ఢిల్లీకి బయల్దేరిన రైతులను హర్యానా పోలీసులు అడ్డుకోవడం, ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ రేకెత్తడం చూస్తున్నామని అమరీందర్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm