హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్, సారపాక ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు చూశామని కొందరు స్థానికులు చెబుతున్నారు. బూర్గంపహాడ్ మండలం సారపాక పుష్కరవణం అడవి నుంచి నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం వైపు రోడ్డు దాటినట్లు తెలిపారు. పులి అడుగులు సారపాక ప్రాంతాల్లో ఉండటంతో పులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పులి అడుగులను గుర్తించారు. సారపాక, రెడ్డిపాలెం, సందేళ్ల, రామాపురం, ముసలిమడుగు ప్రజలు అప్రమత్తముగా ఉండాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm