కామారెడ్డి: జిల్లాలోని రామారెడ్డి మండలం అన్నారంలో సిలిండర్ పేలి పూరి గుడిసె దగ్ధమైంది. వివరాలలోకి వెళ్లితే చాట్ల రాజాంకు చెందిన పూరి గుడిసె అగ్ని ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో రూ.2.10 లక్షలు కాలిపోయినట్టు బాధితుడు తెలిపాడు. పత్తి విక్రయించగా వచ్చిన రూ.1.50 లక్షలు, కూతురు పెళ్లి కోసం అప్పుగా తెచ్చిన రూ.60 వేలు అగ్నికి ఆహుతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. బాధితులకు గ్రామంలోని ఫ్రెండ్స్ యూత్ సభ్యులు 50 కిలోల బియ్యం, రూ.3 వేల నగదు అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm