హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నేడు ప్రారంభమైంది. సిడ్నీ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మెుదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారత్ ముందు 375 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్స్ డేవిడ్ వార్నర్(69),ఆరోన్ ఫించ్(114) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. మాక్స్‌వెల్(45), స్మిత్(105) డాషింగ్ బ్యాటింగ్‌తో అలరించారు. ఐపీఎల్ ఆశించిన స్థాయిలో రాణించని మాక్స్ ఈ వన్డేలో మాత్రం దాటిగా ఆడాడు. చివరకు షమి వేసిన 45వ ఓవర్‌లో మాక్స్‌వెల్(45) ఔటయ్యాడు. తర్వాత కూడా స్మిత్ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తిచేశాడు. చివరకు ఆస్ట్రేలియా నిర్ణత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm