జైపూర్: భారతదేశపు అవయవదాన దినోత్సవం పురస్కరించుకుని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ నేడు అంగదాత స్మారక్‌ను రాష్ట్ర రాజధానిలో ప్రారంభించారు. దేశంలో అవయవదాతల కోసం ప్రారంభించిన మొట్టమొదటి స్మారక చిహ్నం ఇది.ఈ మెమోరియల్‌ను ఆరంభించడంతో పాటుగా నేపథ్యీకరణను మోహన్‌ఫౌండేషన్ జైపూర్ సిటిజన్ ఫోరమ్ నవ్‌జీవన్ (ఎంజెసీఎఫ్ నవ్‌జీవన్) చేయడంతో పాటుగా తమ అవయవాలను మరొకరికి వెలుగునందించడానికి దానం చేయడానికి కట్టుబడిన అసంఖ్యాక వ్యక్తులకు నివాళలర్పిస్తుంది. సుప్రసిద్ధ జైపూర్ డిజైనర్ సమీర్ వీటన్ డిజైన్ చేసిన స్మారకాన్ని దాల్మియా భారత్ సిమెంట్ యొక్క డిజైనింగ్ మరియు సృజనాత్మక విభాగం క్రాఫ్ట్ బీటన్ దీనిని నిర్మించింది. ఈ మెమోరియల్‌ను ఎస్‌ఎంఎస్ ఆస్పత్రి దగ్గరలోని పృథ్వీరాజ్ రోడ్ మరియు టోంక్ రోడ్ కూడలి వద్ద నిర్మించారు.
అంగదాత స్మారక్ నిర్మాణానికి జైపూర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన జంతర్ మంతర్ కట్టడం స్ఫూర్తి. అవయవ దానం ఆవశ్యకత మరియు దాని పట్ల అవగాహన విస్తరించడంలో ఇది ఎంతోదూరం వెళ్లనుంది. విజయవంతంగా అవయవమార్పిడి జరిగితే, ఆ అవయవాలను అందుకున్న వ్యక్తులకు అది పునర్జన్మలాంటిదేనని తరచుగా చెబుతుంటారు. ఈ స్మారక చిహ్నం, ఈ భావాలను ఖచ్చితంగా ఒడిసి పట్టడంతో పాటుగా ప్రజలకు కళ్లు, గుండె, మూత్రపిండాలు వంటి వాటిని అందుకోవడమనేది స్వర్గం దిశగా వారు వెళ్తున్నట్లుగానే తెలుపుతుంది. తద్వారా వారు సాధారణ జీవితం గడుపగలరు. ఈ స్మారకంలోని భారీ ఎర్రటి హృదయం మానవ జీవితంతో పాటుగా జెనెరాసిటీని సైతం చూపుతుంది.
ఈ కార్యక్రమం వద్ద రాజస్తాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లోత్ మాట్లాడుతూ 'దేశంలో మొట్టమొదటిసారిగా అవయవదాతల స్మారక చిహ్నాన్ని మోహన్ ఫౌండేషన్' జైపూర్ సిటిజన్ ఫోరమ్ నవ్‌జీవన్ ఏర్పాటుచేసిందని తెలుసుకోవడం సంతోషంగా ఉంది. జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా నవంబర్ 27, 2020వ తేదీన అంగదాత స్మారక్‌ను ఆవిష్కరించాం. దీనిద్వారా సాహసవంతుల నిస్వార్థ చర్యకు తగిన గౌరవం అందించాలన్నది మా లక్ష్యం. వారు నిస్వార్థంగా తమ అవయవాలను విరాళంగా అందించడంతో పాటుగా అవసరార్థులకు నూతన జీవితాన్నీ ప్రసాదించారు. ఈ మెమోరియల్ నిర్మాణం సైతం ప్రజలకు స్ఫూర్తి కలిగించనుంది. వారు ముందుకు రావడంతో పాటుగా అవయవదానం చేసి, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వారికి నూతన జీవితమూ ప్రసాదించగలరు. అవయవ దాన స్మారక చిహ్నం ఆవిష్కరించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మోహన్ ఫౌండేషన్‌ను అభినందిస్తున్నాను్ణ్ణ అని అన్నారు.
అవయవదాన ఆవశ్యకత గురించి శ్రీ మహేంద్ర సింఘి, ఎండీ అండ్ సీఈఓ దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్ మాట్లాడుతూ 'రాజస్తాన్‌లోని అవయవదాతలకు ఇది అసలైన స్మారకంగా నిలువనుంది మరియు దాల్మియా సిమెంట్ తమ సృజనాత్మక బ్రాండ్ క్రాఫ్ట్ బీటన్‌తో కలిసి దీనిని సాకారం చేయడాన్ని ఓ గౌరవంగా భావిస్తుంది. ఇతరులకు జీవితాన్ని ప్రసాదించేందుకు నిస్వార్థంగా తమ అవయవాలను అందించిన వ్యక్తులకు ఇది అసలైన నివాళి. ఈ తరహా స్మారకాలు ఇతర నగరాలలో సైతం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ స్మారక చిహ్నం ఆవిష్కరణ ద్వారా అవయవదాన ఆవశ్యకత గురించి అవగాహన సృష్టించడంతో పాటుగా తాము మరణించిన తరువాత కూడా ఇతరులకు సేవ చేయవచ్చని చెప్పడమే లక్ష్యం' అని అన్నారు.
అంగదాత స్మారక్ గురించి శ్రీ సందీప్ కుమార్,సీఈవో, క్రాఫ్ట్ బీటన్ మాట్లాడుతూ 'సిమెంట్‌లో సమకాలీన ఫంక్షనల్ ఆర్ట్‌ను సృష్టించడం కోసం క్రాఫ్ట్ బీటన్ ప్రతీకగా నిలుస్తుంది. ఈ స్మారక చిహ్నం మా పనితీరుకు మరో ఉదాహరణగా నిలుస్తుంది. రాజస్తాన్‌లోని అవయవదాతకు నివాళులర్పించడంతో పాటుగా ఈ మహోన్నత కార్యం పట్ల అవగాహన సృష్టించడమనేది నగర అందాలను మరింతగా పెంచడంలో సహాయపడుతుంది' అని అన్నారు.
భారతీయ అవయవ దాన దినోత్సవంను 27 నవంబర్ న నిర్వహించడం ద్వారా తమ మరణం తరువాత అవయవదానం చేయడానికి స్ఫూర్తి కలిగించడంతో పాటుగా అవయదాన ఆవశ్యకత పట్ల అవగాహనను విస్తరించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Nov,2020 04:28PM