హైదరాబాద్ : చాలా రోజుల తర్వాత రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లైవ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించారు. వారడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రేమలో విఫలమైతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు.. ఎంతగానో ప్రేమించిన వ్యక్తి మన పక్కన లేడని, మనం మోసపోయామని అనిపించినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం తప్పు. నీ జీవితం, నీ ప్రాణం కంటే ఎవరు ముఖ్యం కాదు. కౌన్సిలింగ్ తీసుకుంటూ కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతో సులభంగా ఆ బాధ నుంచి బయటపడొచ్చని రేణు సూచించారు. జీవితమంటేనే ఎన్నో ఆటుపోట్లు.. వాటన్నింటిని ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడాలని రేణు దేశాయ్ అభిమానులతో చెప్పుకొచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm