నవతెలంగాణ - డిచ్ పల్లి: అదనపు కట్నం తీసుకొని రావాల్సిందేనని పట్టుబడి వినకపోతే భార్యను కత్తితో కడుపులో పొడిచాడు. మూడు గంటల పాటు ఇంట్లోనే ఉండి భార్యకు రక్తస్రావం కావడంతో తలుపులు తీసి బయటకు వెళ్ళిన సంఘటన పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘనపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై సురేష్ కుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నడ్పల్లి తాండకు చెందిన దివ్యకవిత భర్త రాథోర్ రాజు మధ్య గొడవ జరిగింది. భర్త రాథోడ్ రాజు అదనపు కట్నం కోసం భార్యను కొట్టి ఇంట్లో ఉన్న ఖర్చుతో భార్య కడుపులో వీరికి వివాహం జరిగి నాలుగేళ్లు అయిందన్నారు. వీరిరువురు ప్రేమ వివాహం చేసుకొని మండలంలోని ఘనపూర్ గ్రామంలో ఒక అద్దె ఇల్లు తీసుకుని ఉంటున్నారు. రాజు కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందినడు. రాజు పెయింటర్ గా పని చేసుకుంటాడని వారు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని గాయాలపాలైన దివ్యను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దివ్య పరిస్థితి కుదుట పడుతుందని స్థానికులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm