అమరావతి: నివర్ తుపాను ఏపీలోని 10 జిల్లాలు తీవ్ర ప్రభావం చూపింది. తుపాను కారణంగా ఏపీలో రేపు నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. పలు జిల్లాల్లో పరీక్ష నిర్వహించడం కష్టసాధ్యం కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాయిదాపడిన ఈ పరీక్షను డిసెంబరు 5న నిర్వహిస్తామని ఆర్జీయూకేటీ కన్వీనర్ డి.హరినారాయణ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm