హైదరాబాద్: నివర్ తుఫాన్ తెలంగాణపై ప్రభావం చూపుతోంది. తుఫాన్ కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసాయి. అయితే తుఫాన్ తీవ్రత తగ్గి శుక్రవారం ఉదయానికి అల్పపీడనంగా మారింది. తుఫాన్ ప్రభావంతో చలిగాలులు వీస్తున్నాయి. శుక్రవారం చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతై ఉన్నది. దీంతోపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm