హైదరాబాద్ : జమ్ముకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం మొదటి సారి జరుగుతోన్న స్థానిక సమరంలో భాగంగా నేడు తొలి దశ పోలింగ్ జరగనుంది. మొత్తం 43 డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్(డీడీసీ)లు, 94 నియోజకవర్గాల్లో సర్పంచ్, 368 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
జమ్ముకాశ్మీర్కు గతేడాది స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన అనంతరం తొలిసారిగా అక్కడ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జమ్ముకశ్మీర్ పంచాయతీరాజ్ చట్టంలోని 73వ సవరణను అమలు చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది. అందులో భాగంగా నిర్వహించనున్న 8 దశల ఎన్నికల్లో.. శనివారం (నవంబర్ 28)న తొలి దశలో పోలింగ్ జరగనుంది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొదటి దశలో డీడీసీ, సర్పంచ్, ఉప ఎన్నికల్లో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది.తొలి దశలో మొత్తం 43 డీడీసీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో 25 కాశ్మీర్లో ఉండగా.. 18 జమ్ములో ఉన్నాయి. డీడీసీ ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా దళాలు.. పటిష్ఠమైన రక్షణ వలయాలు ఏర్పాటు చేశాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో గస్తీ నిర్వహిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2020 07:48AM