హైదరాబాద్ : స్వాతంత్ర్యం అనంతర భారతదేశ చరిత్రలో గాంధీ హత్య ఘటనకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ హత్య చేసిన హంతకుడిగా గాడ్సే అందరికి తెలుసు. ఇప్పుడు ఆయన భావజాలాన్ని మరణ వాంగ్మూలం పేరుతో తెరపై చూపించనున్నారు దర్శకుడు భరద్వాజ్ రంగావఝ్ఝల. తెలుగు హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని సూరజ్ కొల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్ను ఆవిష్కరణ కార్యక్రమం నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు కరుణ కుమార్ చేతుల మీదుగా హైదరాబాద్లో శుక్రవారం జరిగింది. రెండేళ్లుగా ఈ సినిమాపై రీసెర్చ్ చేశాను. గాడ్సే భావజాలాన్ని చెప్పడానికి సినిమా తీస్తే బాగుంటుందనిపించి ఈ ప్రయత్నం చేస్తున్నాం అని దర్శకుడు భరద్వాజ్ అన్నారు. డిసెంబరులో ప్రారంభించి, వేసవికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm