వికారాబాద్: జిల్లాలోని బొంరాస్‌పేటలో మద్యం మత్తులో ద్విచక్రవాహనం నడుపుతూ కల్వర్టును డీకొట్టిన సంఘటనలో ఈ ఇద్దరు తీవ్రంగా గాయాపడ్డారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వడిచర్లకు చెందిన వడ్ల విఠల్(40), మంగలి వేణు(30) సాయంత్రం కొడంగల్ నుంచి ద్విచక్రవాహనంపై గ్రామానికి తిరిగి వస్తుండగా రేగడిమైలారం శివారులోని బాపనోనిబావి సమీపంలోని కల్వర్టును ఢీకొట్టారు. దీంతో బైక్‌పై వున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిలో విఠల్ పరిస్థితి విషమంగా ఉందని ఆయన్ను వెంటనే పరిగి ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్నందునే ప్రమాదం జరిగిందని ఎస్సై శ్రీశైలం తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm