హైదరాబాద్ : భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భార్య.. అతడిపై యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని కోదాడలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శ్రీనివాసనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నరసింహారావు(భర్త) మీద అనుమానం రావడంతో భార్య లక్ష్మీ యాసిడ్‌తో దాడికి పాల్పడింది. యాసిడ్ దాడిలో భర్త నరసింహారావు ముఖం మొత్తం ఖాళీ పోవడంతో పరిస్థితి విషమం మారింది. ఈ ఘటనతో అక్కడున్న స్థానికులు వెంటనే నరసింహారావును దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm