హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున నందిగామ వద్ద బైపాస్ రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీక్టొటింది. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో 10 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మృతులు హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన చిన్నారులు ఫజన్ మహబూబ్ ఖాన్(7), ఉక్ష అదిల్ ఖాన్(13)గా గుర్తించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm