హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల వేళ నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్ర్తాలు సంధించుకుంటున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల వేళ ఈరోజు ఎల్బీ స్టేడియంలో కేసీఆర్స సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ సభతో టీఆర్ఎస్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎల్బీ స్టేడియం, చుట్టుపక్కల ఉన్న ప్రజా ఆస్తులపై టీఆర్ఎస్ పార్టీ జెండాలను ప్రదర్శించడం నియమావళికి వ్యతిరేకమని టీపీసీసీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ నిరంజన్ వెల్లడించారు.
ఎల్బీ స్టేడియంలో జరగనున్న కేసీఆర్ బహిరంగ సమావేశానికి మాత్రమే అనుమతినిచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ.. ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేసేందుకు కాదని ఎస్ఈసీకి వివరించారు. నియమావళిని ఉల్లంఘించి ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఉల్లంఘనలకు చెందిన వీడియో క్లిప్పింగ్‌తో ఈసీకి ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2020 12:16PM