హైదరాబాద్ : కరోనా కారణంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. కోత విధించిన జీతాలను అందించేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు కోత పెట్టిన వేతనాలను డిసెంబర్, జనవరి నెలల్లో చెల్లింపులు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కోత విధించిన వేతనాలకు రూ. 2,324 కోట్లు, పింఛనుదారులకు రూ.482 కోట్ల చెల్లింపులు చేస్తామన్నారు. నివర్ తుపాను ప్రభావంపై కేబినెట్‌లో చర్చించామని.. బాధిత రైతులను ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించినట్లు చెప్పారు. తుపాన్‌తో రాష్ట్రంలో 30వేల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 1300 ఎకరాల్లో వాణిజ్య పంటలకు నష్టం జరిగిందన్నారు. పంట నష్టం అంచనాలను డిసెంబర్ 15నాటికి పూర్తి చేసి 31 నాటికి రైతులకు పరిహారాన్ని అందిస్తామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm