హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుందని అన్నారు. హైదరాబాద్‌ను ఓ కుటుంబం దోచుకోవాలని చూస్తోందని వారికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు యోగి. టీఆర్ఎస్ నాయకులు గత హామీలను నెరవేర్చలేదు.. కొత్త హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm