కామారెడ్డి: జిల్లాలోని తాడ్వాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి ఎరుకల పద్మ (38) అన్నారోగ్యంతో మరణించారు. పదేళ్ల క్రితమే అమె భర్త మరణించారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారిని హైదరాబాద్లోని అనాథశరణాలయంలో ఉంచి చదివిస్తోంది. కరోనా నేపథ్యంలో వసతి గృహం తెరుచుకోకపోవడంతో పిల్లలతో కలిసి గ్రామంలో నివసిస్తోంది. గత కొంత కాలంగా ఆమెకు అనారోగ్యం కారణంగా కామారెడ్డిలో ని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. నాలుగు రోజుల క్రితం బంధువుల ఇంట్లో జరిగిన శుభ కార్యానికి వెళ్లింది. అక్కడ మతిస్థిమితం కోల్పోవడంతో హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. తల్లి మరణంతో పిల్లలు విలపిస్తున్న తీరు స్థానికులను కంట తడిపెట్టించింది. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆమె సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2018 వరకు ఆ పదవిలో కొనసాగింది.
Mon Jan 19, 2015 06:51 pm