హైదరాబాద్: గడిజిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 41,322 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారంతో పోలిస్తే, శనివారం నాడు 4 శాతం తక్కువగా కరోనా కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93.51 లక్షలకు చేరింది. 1,36,200 మంది వైరస్ కారణంగా మరణించారు. ఇండియాలో కరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కేరళ రాష్ట్రలల్లో అత్యధికంగా ఉన్నాయని, మిగతా ప్రాంతాల్లో కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్రం వెల్లడించింది. ఇక శనివారం నాడు దేశవ్యాప్తంగా జరిపిన పరీక్షలలో ఢిల్లీలో 5,482 కొత్త కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో 6,185, బీహార్ లో 698 కొత్త కేసులు వచ్చాయి.
Mon Jan 19, 2015 06:51 pm