నల్గొండ: జిల్లాలోని నార్కట్‌పల్లిలో ఓ ప్రైవేట్ బస్సు ఒక్కసారిగా రోడ్డు మీద ఉన్న షాపుల్లోకి దూసుకెళ్లింది. అయితే బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో బస్సులో ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై బస్సులో ప్రయాణిస్తున్న జనాలు డ్రైవర్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఒక వేళ జరగకూడని సంఘటన ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని డ్రైవర్ పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm