హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలో నేటి నుంచి మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. నగరంలో మున్సిపాల్ ఎన్నికల నేపథ్యంలో నేటి సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం సాయంత్రం (డిసెంబర్1వ తేదీ) ఆరు గంటల వరకు హైదరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు ఓటర్లకు మద్యం ఎరగా వేయకుండా ఉండేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు నగర పరిధిలో నేటి నుంచి మద్యం దుకాణాలు మూతపడనుండడంతో నిన్నటి నుంచే నగరంలో మద్యం ప్రియులు భారీగా మద్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే, నగరంలో ఆబ్కారీ అధికారులు ఎవరు పెద్ద ఎత్తున మద్యం కొనుగోళ్లు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎవరైనా అలా చేసినా, విక్రయించినా ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి మద్యం సరఫరా కాకుండా చెక్‌పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm