హైదరాబాద్: సిడ్నిలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్సమెన్స్ మరో సారి భారీ స్కోర్ చేశారు. స్టీవ్‌స్మిత్(104; 64 బంతుల్లో 14x4, 2x6) మెరుపు శతకానికి తోడు డేవిడ్ వార్నర్(83; 77 బంతుల్లో 7x4, 3x6), కెప్టెన్ ఆరోన్ ఫించ్(60; 69 బంతుల్లో 6x4, 1x6), మార్నస్ లబుషేన్(70; 61 బంతుల్లో 5x4), మాక్స్‌వెల్ (63; 29 బంతుల్లో 4x4, 4x6) అర్థశకాలు చేశారు. దీంతో 50 ఓవర్లకు ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 389 పరుగులు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm