సిడ్నీ: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు సాధించాడు. మొదటి మ్యాచ్లో 66 బంతుల్లో 105 పరుగులు, రెండో వన్డేలో కేవలం 62 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తొలి 50 పరుగులను 38 బంతులు తీసుకున్న స్మిత్ మలి 50 పరుగులను కేవలం 24 బంతుల్లోనేసాధించాడు. వన్డేల్లో స్మిత్ ఇప్పటివరకు 11 సెంచరీలు చేయగా.. అందులో భారత్పైనే 5 సెంచరీలు సాధించాడు. భారత్‌పై 5 కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ఆసీస్ ఆటగాళ్లలో రికీ పాంటింగ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. కాగా పాంటింగ్ వన్డేల్లో టీమిండియాపై ఆరు సెంచరీలు సాధించి మొదటిస్థానంలో ఉన్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm