అమరావతి: గుంటూరు జిల్లాలోని వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో భారీగా నకిలీ మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూమిలో పాతిపెట్టిన 16,500 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బెల్గంలో మద్యం తయారు చేసినట్టు గుర్తించారు. 18 మంది నిందితులు అరెస్ట్ చేసిన పోలీసులు మద్యం తయారీ మిషన్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm