నవతెలంగాణ తల్లాడ
నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తల్లాడ మండలం లోని కుర్నవల్లి గ్రామంలో పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు అన్నారు. ఎకరాకు రూ 20,000 నష్టపరిహారం అందించి ఆదుకోవాలన్నారు. సన్నరకం ధాన్యం 2500 కొనుగోలు చేయాలని. తడిచి డ్యామేజ్ అయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు రాకూడదని వారిని అనుమతించ వద్దన్నారు. ప్రతి గింజ మేమే కొంటాను అని ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం డ్యామేజీ ఉందని తేమశాతం ఉందని దాన్యం కొనుగోలు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని జాప్యం లేకుండా లారీలలో పిల్లలకు తరలించాలని. వర్షం వచ్చేలా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని దాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. సందర్భం ధాన్యం సాగు చేసిన రైతులు సీడ్ తేడా వచ్చి నష్టపోయారని దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ జిల్లా అధ్యక్షుడు. బొంతు రాంబాబు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తాత భాస్కరరావు, సిపిఐ(ఎం) మండల కార్యదర్శి సేలం సత్యనారాయణ రెడ్డి, కల్లూరు మండల కార్యదర్శి తన్నీరు కృష్ణార్జున, గ్రామ కార్యదర్శి ఐలూరు రామిరెడ్డి, కట్టా దుర్గయ్య, రమేష్ రెడ్డి, ఎక్కిరాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Nov,2020 03:29PM