హైదరాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పత్తి చేనులో పత్తి ఏరేందుకు వెళ్లిన మహిళపై పులి దాడి చేసి చంపేసింది. పెంచికల్ పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గిరిజన బాలిక పశువుల నిర్మల కొండపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పత్తి చేనులో పత్తి ఏరేందుకు వెళ్లింది. ఆ సమయంలో పులి దాడి చేయడంతో అక్కడికక్కడే ఆ మహిళ మృతి చెందింది. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా కుమ్రం భీం జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఆటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm