హైదరాబాద్ : ఛలో ఢిల్లీని కొనసాగించాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి నిర్ణయించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతులు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ పై రైతులతో చర్చలపై కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన రైతు సంఘాలు హోంశాఖ, నిఘా వర్గాల ద్వారా కాకుండా అత్యున్నత రాజకీయ నేతల స్థాయిలో చర్చలు జరగాలని డిమాండ్ చేశారు. రైతులంతా పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకోవాలని పిలుపిచ్చిన రైతు పోరాట సమన్వయ సమితి డిసెంబర్ 1 నుంచి అన్ని రాష్ట్రాల్లో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు ఇచ్చింది. చర్చలకు కేంద్రం సిద్దామంటూనే రైతులకు కేంద్రం షరతులు విధించడం సరికాదని రైతు పోరాట సమన్వయ సమితి అన్నది. నేరుగా వ్యవసాయ చట్టాలపైనే రైతులతో చర్చించాలని డిమాండ్ తో ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతుల పోరాట స్ఫూర్తిని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి ఈసందర్భంగా అభినందించింది.
Mon Jan 19, 2015 06:51 pm