హైదరాబాద్ : అఫ్గానిస్తాన్‌లో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. స్థానిక ఆర్మీ బేస్ ప్రాంతంలో కారు బాంబును పేల్చారు. ఈ ప్రమాదంలో సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్ల తెలుస్తోంది. ఘాజీ నగర శివారు ప్రాంతంలో ఉన్న తూర్పు ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 'ఈ దాడిలో ఇప్పటివరకు 26 మృతదేహాలను గుర్తించాము. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రభుత్వ భద్రత సిబ్బంది' అని స్థానిక ఘాజీ ఆస్పత్రి డైరెక్టర్ బాజ్ మహ్మద్ హేమత్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm