నవతెలంగాణ రఘునాధపాలెం: కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో వెంటనే చర్చలు జరపాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు .అదివారం నాడు బద్యాతండా లొ జరిగిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఢిల్లీలోనికి రైతులు రాకుండా అడ్డుకోవడం వారిపై జల ఫిరంగులను, భాష్పవాయువును ప్రయోగించటం సిగ్గుచేటని, వారి న్యాయమైన కోర్కెలను తీర్చాలని, ఢిల్లీ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ముగింపు పలకాలని, ఆయన సూచించారు. రైతు ల జివితాలతో కేంద్రప్రభుత్వం చేలగాటం అడుతున్నదని మోడి వెంటనే స్పందించాలని కనీస మద్దతుధరపై రైతులకు కేంద్రం భరోసా ఇవ్వాలని కోవిడ్ నిబంధనతో చలో ఢిల్లీకి వెళుతున్న రైతులను అడ్డుకోవద్దని వారి డిమాండ్లను తప్పకుండా అంగీకరించాలని రైతులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించకపోతే వారికి మద్దతుగా జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు దేశ చరిత్రలోనే తొంభై ఆరు వేల ట్రాక్టర్లు ,కొటి ఇరవై లక్షల మంది రైతులు ఒకే సారి సమ్మె లో పాల్గోనడం ఇదే ప్రథమమని బిజెపి దిగి వచ్చి సమ్మె విరమింప చేయాలని కేంద్రప్రభుత్వం ని డిమాండ్ చేశారు.
నీవర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం యూత్ కాంగ్రెసు నాయకులు కోటేష్ నాయక్ ,జిల్లా కిసాన్ కాంగ్రెసు నాయకులు, కొటేరు నర్సిరెడ్డి ,దరావత్ సుధాకర్ ,వాంకుడోతు చందర్ ,గుగులొతు బిచ్చ,దేవ్ సింగ్, టి శరత్, అశోక, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Nov,2020 07:05PM