హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ప్రచారం ముగిసిన నేపథ్యంలో బయటి వ్యక్తులు జీహెచ్ఎంసీ పరిధి దాటి వెళ్లాలని ఆదేశించారు. అంతేకాకుండా డిసెంబర్ 1 సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తంగా 74,67,256 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 38,89,637 పురుషులు, మహిళలు 35,76,941 మంది, 678 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. మొత్తంగా 9,101 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. వాటిలో 22,272 కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఈసీ వెల్లడించారు
Mon Jan 19, 2015 06:51 pm