హైదరాబాద్ : బిగ్ బాస్ 4 13వ వారంలోకి వచ్చేసింది. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా మరోసారి ఇంటి సభ్యుల మధ్య రచ్చ జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా హారిక వెళ్లి అభిజీత్‌ను నామినేట్ చేయడం కొసమెరుపు. ఇదిలా ఉంటే అవినాష్, అఖిల్ మధ్య కూడా చర్చ వేడిగానే జరిగింది. ఇక అరియానా మోనాల్‌ను టార్గెట్ చేసింది. ఇద్దరి మధ్య ఇంగ్లీష్‌లో మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో అవినాష్ వచ్చి తెలుగులో మాట్లాడమని సూచించాడు. దానికి మోనాల్‌కు ఎక్కడ లేని కోపమొచ్చింది. నేను మధ్యలో మాట్లాడుతున్నపుడు నువ్వెందుకు వచ్చావ్.. మధ్యలో మాట్లాడకు.. ఇక్కడ అందరికీ మాట్లాడే హక్కు ఉంది అంటూ ఫైర్ అయిపోయింది. ఎంతమంది కంట్రోల్ చేసినా కూడా కూల్ కాలేదు మోనాల్. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ కూడా రచ్చ రచ్చగానే పూర్తయ్యాయి. ఈ ప్రోమో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm