హైదరాబాద్: నెట్ ఫ్లిక్స్ సహకరిస్తున్న బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియాలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బీఏఎఫ్ టీఏ) నేడిక్కడ ప్రకటించింది. యూకే, యూఎస్ఏ, చైనాలతో పాటుగా అంతర్జాతీయంగా సినిమా, గేమ్స్, టెలివిజన్ రేపటి తరం సృజ నాత్మక ప్రతిభ ప్రదర్శించేందుకు మరియు అండగా నిలిచేందుకు ఈ ఇన్షియేటివ్ తో బీఏఎఫ్ టీఏ భారతదేశం లోకి తొలిసారిగా అడుగుపెడుతోంది.
బీఏఎఫ్ టీఏ నేడిక్కడ తన బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా2020-21కు ప్రచారకర్తగా ఎ.ఆర్ రెహమాన్ ను ప్రకటించింది. రెహమాన్ తో అనుబంధం యూకే, భారత్ ల మధ్య కొనసాగుతున్న, వృద్ధి చెందుతున్న సృజ నాత్మక సంబంధాలను ఈ అనుబంధం సూచిస్తుంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు అందిం చేందుకు భారతదేశం వద్ద గల నమ్మశక్యం కాని ప్రతిభను ప్రదర్శించేందుకు మరియు రెండు దేశాల మధ్య సహకారానికి కూడా ఇది ప్రతీకగా నిలుస్తుంది.
ఈ సందర్భంగా బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా2020-21కు ప్రచారకర్త ఎ.ఆర్ రెహమాన్ మాట్లాడుతూ, ‘‘సినిమా, గేమ్స్, టెలివిజన్ లలో భారతదేశం అందించగలిగే అద్భుత ప్రతిభను కనుక్కోవడంలో బీఏఎఫ్ టీఏ తో కలసి పని చేయడం నాకెంతో సంతోషదాయకం. ఈ రంగాలలోకి రావాలనుకునే వారికి ఇదో అద్భుత అవకాశం. ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రతిభావంతులతో సంబంధాలు ఏర్పరచుకునేందుకు మాత్రమే గాకుండా బీఏ ఎఫ్ టీఏ విజేతలు, నామినీలతో మార్గదర్శకం పొందేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మద్దతు లభిస్తుంది. భారత దేశం నుంచి అంతర్జాతీయ వేదికపై ప్రదర్శితమయ్యే ప్రతిభను ఎంచుకునే అవకాశం కోసం చూస్తున్నాను’’ అని అన్నారు.
బీఏఎఫ్ టీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా బెర్రీ ఒబె ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మొదటిసారిగా బ్రేక్ త్రూ అ ప్లికేషన్స్ ను భారతదేశంలో ప్రారంభిస్తున్నందుకు మేమెంతో ఆనందిస్తున్నాం’’ అని అన్నారు. ‘‘తన సృజన రంగంలో పరిశ్రమ ప్రముఖుడిగా ఉన్న మా ప్రచారకర్త ఏ.ఆర్ రెహమాన్ అందిస్తున్న అమూల్యమైన మద్దతు కు మా ధన్యవాదాలు. నూతన ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడంలో మాకు గల మక్కువను ఆయన అందరితో పంచుకోనున్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేసేందుకు ఆయన తగినవారు. హిందీ, తమి ళం, తెలుగు సినిమాల్లో ఆయనకు చక్కటి గుర్తింపు ఉంది. పరిశ్రమలో అందరినీ చేరుకునేందుకు బీఏఎఫ్ టీఏ కు అది తోడ్పడుతుంది’’ అని అన్నారు. బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా లో భాగంగా, ఏడాది కాలం కొనసాగే మెంటరింగ్ మరియు గైడెన్స్ కార్యక్రమం కింద బ్రిటిష్ మరియు భారతీయ పరిశ్రమ నిపుణులతో కూడిన జ్యూరీ భారతదేశవ్యాప్తంగా ఐదు మంది ప్రతిభా వంతులను ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారు వన్ టు వన్ మెంటరింగ్, గ్లోబల్ నెట్ వర్కింగ్ అవకాశాలను పొందగలుగుతారు. బీఏఎఫ్ టీఏ కార్యక్రమాలకు, స్ర్కీనింగ్ లకు 12 నెలల పాటు ఉచిత యాక్సెస్ ఉంటుంది. పూర్తిస్థాయి వోటింగ్ బీఏఎఫ్ టీఏ సభ్యత్యం ఉంటుంది. ఎంపికైన ప్రతిభావంతులు బ్రిటిష్ మరియు భారతీయ పరిశ్రమల్లోని కొంత మంది ప్రముఖుల నుంచి నేర్చుకునే అవకాశాలను, ప్రపంచవ్యాప్తంగా తమ లాంటి వారితో తమ నైపుణ్యాలను పంచుకునే అవకాశాలను పొందుతారు. భౌగోళిక సరిహద్దులకు అతీతంగా అవకాశాలను పొందగలుగుతారు. బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ కళాకారులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయబడుతారు.
పరిశ్రమకు చెందిన వివిధ విభాగాల ప్రముఖులతో, నిపుణులతో ఉండే జ్యూరీ ద్వారా బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఎంపిక ఉంటుంది. యూకే, యూఎస్ జ్యూరీలలో ఫియోనా షా (నటి), పాపా ఎస్సీడు (నటుడు) ఎడ్వర్డ్ ఎన్ని ఫుల్ (ఎడిటర్ ఇన్ చీఫ్ – బ్రిటిష్ వోగ్) జోడి అజర్ (గేమ్స్ డెవలపర్) కాటె టౌన్ సెండ్ (డైరెక్టర్) తదితర ప్రముఖులు ఉన్నారు. బ్రేక్ త్రూ ఇండియా కు 2020 జ్యూరీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ప్రపంచవ్యాప్తంగా 2020 మే లో ప్రారంభమైంది. గతంలో దీన్ని బ్రేక్ త్రూ బ్రిట్స్ గా వ్యవ హరించారు. యూకే లో ఇది 2013 నుంచి నిర్వహించబడింది. చైనాలో ఇది 2019లో ప్రారంభమైంది. అయితే యూకే, యూఎస్, ఇండియా, చైనాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిభను గుర్తించే కార్యక్రమం మాత్రం ఇదే మొదటి సారి.
బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ మొదటి అంతర్జాతీయ కోహర్ట్ ను వేడుక చేసుకునేందుకు, వివిధ దేశాలకు చెందిన వారి మధ్య సంబంధాలను ప్రోత్సహించేందుకు, సహకారాలను పెంపొందించుకునేందుకు ఈ ఏడాది బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ గ్లోబల్ పార్టిసిపెంట్స్ అంతా కూడా 2021 లో ఒక్కచోటుకు చేరనున్నారు. ప్రపంచవ్యాప్తంగా భిన్న సంస్కృతుల మధ్య నెట్ వర్కింగ్ ను మెరుగుపరిచేందుకు రాబోయే నెలల్లో ఈ ఇన్షియేటివ్ డిజిటల్ కమ్యూనికేషన్ ను ఉపయోగించడాన్ని కొనసాగించనుంది.
యూకే, యూఎస్ ఏ, భారతదేశంలలలో బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ కు అధికారిక సపోర్టింగ్ పార్ట్ నర్ గా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ కార్యక్రమ అంతర్జాతీయ విస్తరణకు మద్దతును అందించనుంది. ప్రపంచవ్యాప్తంగా వర్ధమాన ప్రతిభా వంతులకు అవకాశాలను అందించేందుకు, గ్లోబల్ నెట్ వర్క్ ల మధ్య అంతర్జాతీయ సమాజాలను ఏక తాటిపైకి తీసుకురావడంలో, విభిన్న సంస్కృతుల నుంచి గొంతుకలు వినిపించేలా చేయడంలో బీఏఎఫ్ టీఏ, నెట్ ఫ్లిక్స్ ఒక ఉమ్మడి ఆశయాన్ని కలిగిఉన్నాయి.
అప్లికేషన్ ప్రక్రియ
భారతదేశంలో అర్హులైన అభ్యర్థుల నుంచి నవంబర్ 30 నుంచి బీఏఎఫ్ టీఏ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతీయ సినిమా పరిశ్రమ, గేమ్స్, టీవీ పరిశ్రమలకు చెందిన నూతన నటులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు, కంపోజర్, సినిమాటోగ్రాఫర్, గేమ్స్ డైరెక్టర్, గేమ్ ప్రొడ్యూసర్ లేదా గేమ్ డెవలపర్ దరఖాస్తు చేసుకోవచ్చు. www.bafta.org/supporting-talent/breakthrough/bafta-breakthrough-indiaపై తమ దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2021 జనవరి 25. దరఖాస్తు దాఖలు నాటికి దరఖాస్తుదారులు 18 ఏళ్ళకు పైబడిన వయస్సు కలిగిఉండాలి. భారతదేశంలో కనీసం 2 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలి. ఇంగ్లీషులో మాట్లాడడంలో ప్రావీణ్యం ఉండాలి. సినిమా, గేమ్స్, టీవీలలో భిన్న సంస్కృతుల మధ్య సంబంధాలను పెంచాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమంలో అభ్యర్థులు తమ నైపుణ్యాలను యూకే వారితో పంచుకోవాలి లేదా యూకే వీక్షకుల కోసం కంటెంట్ ను రూపొందించాలి. అభ్యర్థులు సంబంధిత ప్రాంతీయ సినిమా, గేమ్స్ లేదా టెలివిజన్ పరిశ్రమ సంస్థతో సిఫారసు తెచ్చుకోవాల్సి ఉంటుంది మరియు తాము చేసిన వర్క్ కు సంబంధించి దిగువ అంశాలకు సంబంధించి అగ్రగామి ప్రొఫెషనల్ క్రెడిట్ పొందిఉండాలి.
- భారతదేశంలో థియేటర్లలో విడుదలై ఉండాలి
- భారతదేశంలో టీవీ చానల్ లో లేదా ఓటీటీ వేదికపై ప్రసారమై ఉండాలి
- లేదా భారతదేశంలో విడుదలై ఉండాలి మరియు వీక్షకులు ప్లే చేసేలా ఉండాలి
- బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా సినిమా, గేమ్స్, టీవీలకు సంబంధించిన వర్ధమాన తారలను 202-21 లో ప్రదర్శించనుంది, నెట్ ఫ్లిక్స్ దీనికి అండగా నిలిచింది.
www.bafta.thirdlight.com లో ఫోటోగ్రఫీ లభ్యమవుతుంది
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 30 Nov,2020 05:45PM