హైదరాబాద్ : ఫ్లిప్‌కార్ట్ మరోసారి భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఇటీవల ఐదు రోజుల బ్లాక్ ఫ్రైడే అమ్మకాన్ని చేపట్టిన సంస్థ తాజాగా ప్రతీ నెల మొదటి రోజుల్లో ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ పేరుతో బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది. డిసెంబర్ 1 నుండి 3 వరకు అందిస్తున్న ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం తగ్గింపును అందిస్తోంది. అలాగే టీవీలు, ఏసీలు రిఫ్రిజిరేటర్లలో 50 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఇంకా బట్టలు, పాదరక్షలు, ఉపకరణాలు, బ్యూటీ, క్రీడలు, ఫర్నిచర్, గృహాలంకరణ ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్, ఆఫర్లను ప్రకటించింది. హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై 70శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ల్యాప్‌టాప్‌లపై 30శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. 8,999 రూపాయలు ధర వద్దే స్మార్ట్ టీవీలను అందిస్తోంది. దీంతోపాటు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వారంటీ పొడగింపు వంటి సదుపాయం కూడా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm