హైదరాబాద్ : ప్రముఖ సామాజిక కార్యకర్త, బాబా అమ్టే మనవరాలు షీతల్ ఆమ్టే కరాజ్గి ఆత్మహత్య చేసుకుంది. ఆనంద్‌వన్‌లో చంద్రపూర్ జిల్లాలో ఉన్న తన నివాసంలో సోమవారం ఆమె ఆత్యహత్య చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఈమె మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు కాగా పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం. మహారోగి సేవా సమితి లో జరిగిన అవకతవకలపై ఫేస్‌బుక్ లో చేసిన ఆరోపణలు తరువాత ఆమె చనిపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. స్వచ్ఛంద సంస్థ మహారోగి సేవా సమితి సీఈవో, బోర్డు సభ్యురాలు అయిన షీతల్ వైద్యనిపుణురాలు. డిజేబిలిటీ స్పెషలిస్ట్ కూడా. ప్రధానంగా కుష్టు వ్యాధి బాధితులకు సహాయం చేసేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థలో ఆమె కీలక పాత్ర వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం 'యుద్ధమూ శాంతి' గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. అనంతరం కొన్ని గంటలోనే ఇలాంటి ఆత్మహత్య నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm