హైదరాబాద్: గతవారంలో నివర్ తుపానుతో అతలాకుతలం అయిన తమిళనాడు రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుందని, ఆ తర్వాత అది తుపాను గా మారి రేపు శ్రీలంక తీర ప్రాంతాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. దాని ప్రభావంతో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm