నల్లగొండ: నల్లగొండ: నాగార్జునసాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు. నోముల మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. సుదీర్ఘకాలంలో సీపీఐ(ఎం)లో పని చేసిన నోముల నర్సింహయ్య 2013లో టీఆర్ఎస్ చేరారు. ఆయన సీపీఐ(ఎం) తరపున నకిరేకల్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీపీఐ(ఎం) శాసనసభపక్ష నేతగా, ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పనిచేశారు. 2014 ఎన్నికలలో జానారెడ్డి పై పోటీ చేసి ఓటమి చవిచూశారు. అనంతరం 2018లో నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై నోముల నర్సింహయ్య విజయం సాధించారు.
Mon Jan 19, 2015 06:51 pm