మాస్కో: రష్యాలో భూకంపం సంభవించింది. భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. కాగా ఈరోజు ఉదయం రష్యాతో పాటు అర్జెంటీనాలో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఈ భూకంపాన్ని ధృవీకరించింది, భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని తెలిపింది. భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున అర్జెంటీనాలోని శాన్ ఆంటోనియో డి లాస్ కోబ్రేకు పశ్చిమ-నైరుతి దిశలో 76 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
Mon Jan 19, 2015 06:51 pm